దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. ఆర్జీవీ చేసిన వివాదస్పద ట్వీట్ పై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖలో కోరారు.